Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో

Kasipet Mandal News:-
కాసిపేటలో స్వామి వివేకానంద జయంతి మరియు
జాతీయ యువజన దినోత్సవం వేడుకలను స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అన్న నినాదాన్ని యువత గుర్తించి చెడు మార్గంలో నడవకుండా సేవాభావంతో అంకితభావంతో సమాజ శ్రేయస్సుకై యువత ముందు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథగా బ్లూ కోట్ పోలీస్ ఆఫీసర్ రాజేందర్ గారు, స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మంద సత్యం, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పుర్ర కుమారస్వామి యాదవ్, సహాయ కార్యదర్శి మంద వెంకటేష్, సలహాదారు రాజన్న, స్పందన యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు రేషవేని స్వామి, పుట్ట తిరుపతి, అన్వేష్, వరుణ్, నగేష్, మంద తిరుపతి, మారం నరేష్, అంకులు తదితరులు  పాల్గొన్నారు. 



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App