కాసిపేట మండలానికి చెందిన యువకుడు
ఇండియన్ ఆర్మీ నేపథ్యంలోని ధీర అనే షార్ట్ ఫిలిం తీసి ఢిల్లీ లోని ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ఎన్జీవో సంస్థ నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో సబ్మిట్ చేశాడు. అంతకుముందు తీసిన ప్రణామం, బ్యాన్ ప్లాస్టిక్ షార్ట్ ఫిలిమ్స్ చూసి ఇతని ప్రతిభను గుర్తించిన ఒక పటాస్ షో కమెడియన్ ఇతని దర్శకత్వంలో షార్ట్ ఫిలింలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే కాసిపేట మండలం వరిపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సంతోష్ అనే యువకుడు చిన్నతనం నుండే సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక ఉండేది. ఆ కోరికతో తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో (2014) నోకియా కీప్యాడ్ మొబైల్ తోనే వీడియో రికార్డు చేసి షార్ట్ ఫిలిం తీశాడు. ఇంటర్మీడియట్ తర్వాత MLT చదువుతున్న సమయంలో కాలేజీలో జరిగే ఫేర్వెల్ పార్టీలో స్క్రిప్ట్ రాసి అందరి ప్రశంసలు పొందాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో రెండు నెలలు కూలి పని చేసి వచ్చిన డబ్బు తీసుకొని ఇంట్లో వారికి హాస్పిటల్లో జాబ్ చేయడానికి వెళుతున్నా అని అబద్ధం చెప్పి హైదరాబాద్ కి వెళ్లి పేమెంట్ లేకుండా ఒక డైరెక్టర్ వద్ద దర్శకత్వం నేర్చుకోవడానికి వెళ్ళాడు. తినడానికి, కనీసం ఇంటికి రావడానికి కూడా డబ్బు లేకపోవడంతో తన రూమ్ మేట్స్ దేవునీదగ్గర పెట్టిన డబ్బులు తీసుకొని వాటితో హన్మకొండ వరకు వచ్చి తన స్నేహితుని రూమ్ లో బస చేసాడు. మరునాడు స్నేహితుడి దగ్గర చార్జీలకు డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో వారికి నిజం చెప్పగా వారు మందలించడంతో, మరోవైపు దర్శకత్వం కలలు ఆవిరైపోయాయని దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ప్రతిఒక్కరు సినిమాలు ఎందుకురా నీకు, నీతో కాదురా అని నిరుత్సాహపరిచేవారు. కొంత కాలం తర్వాత రెండు నెలలపాటు కాసిపేట పెట్రోల్ బంకులో, మూడు నెలలపాటు మంచిర్యాలలోని నందిని హాస్పిటల్ ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేశాడు. డైరెక్టర్ కావాలన్న తన ఆరాటం చూసి ఇండస్ట్రీలో పనిచేస్తున్న అతని బావ వంశీ హైదరాబాదులో GLB శ్రీనివాస్ దర్శకుని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పియడంతో డైరెక్షన్ నేర్చుకున్నాడు. ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయడానికి కెమెరా కోసం డబ్బులు లేకపోవడంతో, కనీసం అతని దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేకపోవడంతో తన బావ మొబైల్ తోనే వీడియో తీస్తూ, మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తూ అవస్థలు పడుతున్నాడు. అతనిలాగే కసి ఉన్న, అవకాశం కోసం ఎదురు చూస్తున్న నటులతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు. సంతోష్ తీసిన ప్రణామం, బ్యాన్ ప్లాస్టిక్ షార్ట్ ఫిలిమ్స్ చూసి జబర్దస్త్, పటాస్ షో నటుడు డబ్బులు తీసుకోకుండా షార్ట్ ఫిలింలో నటిస్తానని అతనికి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం సంతోష్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.
సంతోష్ మాట్లాడుతూ ఎవరైనా ప్రొడ్యూసర్ తనకు అవకాశం కల్పిస్తే సినిమా తీస్తానని అంటున్నాడు. Kasipet Mandal App తరపున డైరెక్టర్ కావాలనే అతని ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాము. దయచేసి అతని యూట్యూబ్ ఛానల్ Victory Boys చానల్ ని Subscribe చేసి సపోర్ట్ చేయండి.
![]() |
Durgam Santhosh Short film Director |