Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Kasipet News/Kondapur:-
భారతీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే
జయంతిని కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీ విద్య, మహిళా హక్కుల కోసం ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మక్కల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సులోచన, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

 పిచ్చి మొక్కల తొలగింపు:-
కొండాపూర్ (యాప) గ్రామంలో పల్లె ప్రగతి రెండవ రోజు లో భాగంగా పారిశుద్ధ్య పనులు  నిర్వహించారు. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ సులోచన, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.







Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App