Kasipet Mandal News:-
ఆదివారం తెల్లవారుజామున పెద్దనపల్లి రాష్ట్రీయ
రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రంజిత్ అనే యువకుడు మృతి చెందాడు. ఎర్ర రంజిత్ లారీ డ్రైవర్ గా జీవనం సాగించేవాడు. లారీలో తాండూర్ నుండి మందమర్రి వైపుగా వస్తున్న తరుణంలో పెద్దనపల్లి వద్ద లారీలో డీజిల్ అయిపోవడంతో లారి ని పక్కకు ఆపి డిజిల్ పోస్తున్నాడు. మందమర్రి వైపుగా వస్తున్న లారీ వెనుక ఆగి ఉన్న మరో లారి ని ఢీ కొనడంతో టైర్ల కింద పడ్డ రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.