Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో గణతంత్ర వేడుకలు
ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయ గీతాన్ని పాడి 71వ గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో పంచాయతీ కార్యదర్శులు జెండాను ఆవిష్కరించారు. తహసిల్దార్ కార్యాలయంలో ఎం.ఆర్.వో భూమేశ్వర్ గారు జెండాను ఎగరవేశారు. పాఠశాలలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దేవాపూర్ ఓరియంట్ కంపెనీ మరియు కార్మెల్ స్కూల్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో ఓరియంట్ సిమెంట్ అధ్యక్షులు ఎస్ కె పాండు గారు, మూర్తి గారు పాల్గొన్నారు.
క్షమించండి సర్వర్ ప్రాబ్లం వలన ఫొటోస్ అప్లోడ్ కావడం లేదు.