కాసిపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో
నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మండల ప్రత్యేక అధికారి సంజీవ రావు గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భూమేశ్వర్, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఏపీఓ స్వాతి, ఏపిఎం వెంకటేశ్వర్లు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
