Kasipet News/Lambadithanda(D):-
Kasipet మండలంలో కొత్తగా ఏర్పాటైన
లంబాడి తండ (డి) గ్రామపంచాయతీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ తిరుపతి, తాహసిల్దార్ భూమేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ తిరుపతి గారు మాట్లాడుతూ లంబాడి తండ (డి) గ్రామంలో 150కి పైగా కుటుంబాలు ఉన్నాయని, రేషన్ కోసం పక్క గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకోవడం ఇబ్బందవుతుందని, రవాణా ఖర్చులు కూడా అవుతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ గారికి తెలియజేయగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, సక్రియా, గజానంద్, రవి తదితరులు ఉన్నారు.