People Awareness:-
కాసిపేట మండలంలోని వాట్సప్ గ్రూపులలో ఒక ఫేక్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. నరేంద్ర మోడీ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ విజయం కోసం 400 రూపాయల టాక్ టైం ఇస్తున్నాడని, మూడు గ్రూపులకు ఈ సందేశాన్ని పంపాలని, ఐదు నిమిషాల తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోండని ఫేక్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
వాట్సప్ గ్రూపులలో మెసేజ్ ఫార్వర్డ్ చేసేముందు నిజమో అబద్దమో తెలుసుకొని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వాట్సప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తూ గ్రూపులోని సభ్యులకు ఇబ్బంది కలిగించకండి.