Sports News:-
జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు జనగామలో
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నాయి. మంచిర్యాల జూనియర్ జట్టు ఎంపిక కోసం ఈ నెల 24న పోటీలు నిర్వహించనున్నారు. పోటీలలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు మంచిర్యాల జిల్లా జట్టు తరఫున రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 24న శుక్రవారం శ్రీరాంపూర్ లోని ప్రగతి మైదానంలో రిపోర్టు చేయాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దివాకర్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9052490074 నెంబర్ కు సంప్రదించాలని ఆయన సూచించారు.