కాసిపేట మండలంలోని మల్కెపల్లి ఆశ్రమ
పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు దేవాపూర్ ఓరియంట్ కంపెనీ ఏజిఎం లక్ష్మీనారాయణ గారు, హెచ్ఆర్ శ్రీనివాస్ గారు విద్యా సామాగ్రి అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డురాకూడదని, బాగా చదువుకొని స్కూల్ కి, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మీనా రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
