Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

లయన్స్ క్లబ్ సోమగూడెం కు అవార్డుల పంట

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో లయన్స్ క్లబ్ అఫ్
సోమగూడెం వారు చేసిన సేవలకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 320 జి వారు 12 అవార్డులు ప్రధానం చేశారు. ఆదివారం సాయంత్రం క్యాతనపల్లి M.R గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ బహుమతులను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షులు గొంది వెంకటరమణ గారికి ఉత్తమ అధ్యక్షులుగా అవార్డు రాగా, వేముల కృష్ణ గారికి ఉత్తమ కార్యదర్శిగా అవార్డు లభించింది. గొంది వెంకటరమణ గారు మాట్లాడుతూ సోమగూడెం లయన్స్ క్లబ్ కి 12 అవార్డులు రావడం సంతోషకరం గా ఉందని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి తమ క్లబ్ ను ఉత్తమ క్లబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ అరకోళ్ల సంపత్ గారు, నల్లాల భాగ్యలక్ష్మి - ఓదేలు గారు, కార్యదర్శి వేముల కృష్ణ గారు, కోశాధికారి దూడం మహేష్ గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్ధాల భాస్కర్, సభ్యులు కొమురయ్య, పాముల దినేష్ తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App