బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి
పితృవర్యులు శ్రీ దుర్గం రాజం గారు అనారోగ్యంతో ఇటీవల స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. వారి స్వగ్రామమైన జెండావెంకటాపూర్ గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే గారిని వారి కుటుంబసభ్యులను ఈరోజు కాసిపేట మండలం నాయకులు, ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య గారు, కాసిపేట ఎంపీటీసీ అక్కిపల్లి లక్ష్మి గారు, మాజీ ఎంపీటీసీ ఏనుగు మంజులరెడ్డి గారు, సర్పంచులు అజిమెరా తిరుపతి గారు, స్వప్న గారు, మక్కాల శ్రీనివాస్ గారు, నాయకులు ఏనుగు సుధాకరెడ్డి గారు, ముత్యాలు రాజు గారు, అల్లంల చంద్రయ్య, బుగ్గ రాజు మరియు అజిమెరా దేవిలాల్ పాల్గొన్నారు.