Kasipet మండలం చొప్పరిపల్లి రాష్ట్రీయ
రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అర్జునే గిరీష్ అనే వ్యక్తి మృతి చెందగా, గణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పూర్తివివరాలలోకి వెళ్తే ఇంద్రవెల్లి మండలానికి చెందిన అర్జునే గిరీష్ కుమారుడు బెల్లంపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. సంక్రాతి సెలవులు ముగియడంతో శుక్రవారం హాస్టల్లో చేర్పించాడు. బైక్ పై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో చొప్పరిపల్లి సమీపంలో RTC బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయంలో అర్జునే గిరీష్ మృతి చెందాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి గణేష్ పరిస్థితి విషమంగా ఉంది.
