Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిందితునిపై పి.డి యాక్ట్ అమలు

Kasipet Mandal News:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన
బండ సంపత్ అనే వ్యక్తిపై పి.డి యాక్ట్ అమలు చేసినట్లు మందమర్రి సీఐ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగతనాలకు పాల్పడే వాడని, గత ఐదు సంవత్సరాల నుండి మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశాడని తెలిపారు. ప్రస్తుతం లక్సెట్టిపేట సబ్ జైల్లో ఉన్న సంపత్ కి పి.డి యాక్ట్ పత్రాన్ని అందజేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App