Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతులకు అవగాహనా కార్యక్రమం

Kasipet News/Konur:-
కాసిపేట మండలంలోని కోనూరు గ్రామంలో
లయన్స్ క్లబ్ మెంబెర్ భాస్కర్, ఏకలవ్య కోఆర్డినేటర్ పెంటయ్య గారు, ఓరియంట్ AGM లక్ష్మీనారాయణ గారు మరియు రైతు సంఘం విశ్లేషకులు గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో శనివారం రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ములుకునూర్ రైతు సంఘం తరహాలో ఇక్కడకూడా రైతులే స్వయంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, విత్తనాల ఎంపిక, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొదలగు విషయాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోనూర్ సర్పంచ్ స్వరూప గారు, తంగళ్ళపల్లి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అక్కల రమేష్ గారు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App