Kasipet News/Devapur:-
మంచిర్యాలలో జరిగిన జిల్లా స్థాయి పరుగుపందెం
పోటీలలో కార్మెల్ స్కూల్ దేవాపూర్ పదవ తరగతి విద్యార్థి పన్నాల మణిదీప్ మొదటి పతకం సాధించి రాష్ట్రస్థాయి పరుగుపందెంలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. పేద విద్యార్థి అయిన పన్నాల మణిదీప్ కి లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు తన తండ్రి గొంది బుచ్చన్న గారి జ్ఞాపకార్థం ట్రాక్ షూట్ మరియు షూస్ అందించారు. కార్యక్రమంలో దేవపూర్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం తరపున బాల గిరిధర్, సంక్షేమ అధికారి తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరావు, కిలన్ ఇంచార్జి సమీర్ గాంధీ లతోపాటు లయన్స్ మెంబర్స్ మరియు 100 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.