కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి
చెందిన కడమంద బాలయ్య కు అత్యాచారం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. నాలుగు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు దేవాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఫస్ట్ అడిషనల్ కోర్టులో పూర్తి విచారణ తరువాత బాలయ్యకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించినట్లు దేవాపూర్ ఎస్ఐ దేవయ్య తెలిపారు.
