Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో
డి.ఆర్.డి.ఓ శేషాద్రి గారు పంచాయతీ కార్యదర్శుల తో, ఫీల్డ్ అసిస్టెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల లోపు ఇంకుడు గుంత నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాలు చేపట్టకపోతే లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అందే పథకాలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి మేఘమాల, ఏపీడి మల్లేష్, ఏపీఓ స్వాతి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.