కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ
పంచాయతీ కార్యాలయం ఎదురుగా గ్రామ పంచాయతీ నిధుల నుండి సి. సి రోడ్ పనులను సర్పంచ్ వేముల కృష్ణ గారు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిదులగా జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసి రాంచందర్, ఉప సర్పంచ్ సోమని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్, కంచర్ల పద్మ, బొల్లపల్లి కొమురక్క, కో ఆప్షన్ సభ్యులు గుర్రం వజ్ర, జీదుల కనకయ్య, కార్యదర్శి కె. నాగరాజు, స్థానిక నాయకులు కూకట్ల దేవెందర్, గాదం గట్టయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.