Telangana News:-
తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలో నిర్వహిస్తున్న
పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించడానికి జనవరి 1వ తేదీ నుండి ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు గ్రామాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి అందించనున్నాయి.
ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మూడు క్యాడర్ల నుండి ఉన్నత అధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అలసత్వం వహించనున్నట్లు రుజువైన అధికారులు, ప్రజాప్రతినిధుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.