Kasipet News/Madhimada:-
కాసిపేట మండలంలోని మద్దిమాడ గ్రామానికి
చెందిన బద్ది పోశం అనే వ్యక్తి శుక్రవారం జ్వరంతో మృతిచెందాడు. పది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడని, గురువారం మంచిర్యాల ఆసుపత్రికి తరలించామని, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైదరాబాద్ తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతుడు బద్ది పోశం వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు.