Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం

Kasipet News/Devapur:-
Kasipet మండలంలోని Devapur కార్మెల్ గిరి
కాన్వెంట్ హైస్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో పరీక్షలు-విజయం 2020 పేరుతో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ శ్రీ దోమల నాగేంద్ర గారు హాజరై విద్యార్థులు పరీక్షలలో భయం లేకుండా ఇలా రాయాలో , పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో అని తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రతిఫలంగా స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని, అలా సాధిస్తే స్కూల్ హెచ్ఎం tissy సిస్టర్ గారికి మరియు 9.5 నుండి 10 gpa సాధించిన విద్యార్థులకు క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం స్కూల్ ఎగ్జామ్స్ లో 50 శాతం కన్నా తక్కువ మార్కులు పొందే విద్యార్థులు తుది పరీక్షలలో 6.5 జిపిఏ కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే వారిని కూడా సన్మానిస్తుమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణగారు, దోమల నాగేంద్ర గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్ గారు, వేముల కృష్ణ గారు, మేడ సమ్మయ్య, స్కూల్ హెచ్ఎం tissy సిస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 పైన కనిపిస్తున్న వాట్సాప్ బటన్ క్లిక్ చేసి మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. 
 యాప్ అప్డేట్ చేసుకుని వారు ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ చేసుకోండి. 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App