Kasipet News:-
కాసిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు
బుధవారం సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ లో గ్రామసభ నిర్వహించాల్సి ఉండగా ప్రజలందరూ హాజరయ్యారు. కాగా సమావేశానికి అధికారులు ఎవరు హాజరు కాకపోవడంతో సమావేశం నిర్వహించలేదు. దీంతో గ్రామ సభ పెడతామని చెప్పి పెట్టకపోవడంతో పాటు సమస్యలు విన్నవించుకునె అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో తీవ్ర నీటి సమస్య ఉండడంతో పాటు రోడ్లు, డ్రైనేజ్, ఇతర సమస్యలు ఉన్నాయని సర్పంచ్ నిర్లక్ష్యంతోనే సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మి, ఉప సర్పంచ్ సుమన్, వార్డు సభ్యులు అగ్గి సాయి, టిఆర్ఎస్ నాయకులు అగ్గి సత్తి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Source From:- sakshi