Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కందకం పనులను అడ్డుకున్న గిరిజన రైతులు

Kasipet News/Venkatapur:-
అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కందకం
పనులను మంగళవారం వెంకటాపూర్ రైతులు అడ్డుకున్నారు. పోడు వ్యవసాయాన్ని నమ్ముకొని 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు బలవంతంగా స్వాధీనం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై అటవీ పరిరక్షణ పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని, పంటలు వేసిన భూములను ధ్వంసం చేస్తూ కందకాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో గ్రామ సభ తీర్మానం లేకుండా పనులు చేయవద్దని ఉన్న కందకాలు తవ్వుతున్నారని గిరిజన సంఘాలు ఆరోపించాయి. విషయం తెలుసుకున్న దేవాపూర్ ఎస్ఐ దేవయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సయ్యద్ మజారుద్దీన్ అహ్మద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అటవీశాఖ భూములపై జాయింట్ సర్వే చేసి అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని చెప్పడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. గిరిజన సంఘాల నాయకులు ఆడే శంకర్,  ఆడే జంగు,  కనకరాజు, హన్మంతు,  అనంతరావు, ఆత్రం గంగు, ఆత్రం బొజ్జిరావు, ఆత్రం సూర్యకాంత్,  ధర్ము పాల్గొన్నారు.

Source From:- Andhra jyothy 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App