Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు, ఫైనల్లో గెలుపొందిన జట్లు ఇవే

Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని సింగరేణి రామకృష్ణాపూర్
ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. ఫైనల్లో బాయ్స్ విభాగంలో ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల మధ్య పోటీ జరగగా ఈ పోటీలో వరంగల్ జట్టు గెలుపొందింది. అలాగే గర్ల్స్ విభాగంలో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మధ్య పోటీ జరగగా ఇందులో రంగారెడ్డి  జట్టు ఫైనలో గెలుపొందింది. ఈ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారిణి ఆయిశ్య కు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు 1,116 ప్రోత్సాహక బహుమతి అందించారు. ఇందులో రవి ప్రకాష్ గారు,  ACP రెహమాన్, కమాండర్ సంజయ్, మహేష్, వాలీ బాల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App