State Bank of India:-
SBI బ్యాంకు వినియోగదారులకు జనవరి 1 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సేవలను అందుబాటులోకి తేనుంది. SBI ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసేటప్పుడు మొబైల్ కి OTP నెంబర్ వస్తుంది. ఓటిపి నెంబర్ ఏటీఎం లో ఎంటర్ చేస్తేనే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. మోసపూరితమైన ట్రాన్సాక్షన్ ల నుండి వినియోగదారుడు రక్షణ పొందడానికి ఈ పద్ధతిని తీసుకువస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఎస్బిఐ ఏటీఎం ద్వారా 10 వేలకు మించి నగదు విత్ డ్రా తీసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు.