Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ధర్మారావుపేటలో రెండవ రోజు కొనసాగిన ఎన్ఎస్ఎస్ క్యాంపు

Kasipet News/Dharmaravpet:-
Kasipet మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో
జాతీయ సేవా పథకం లో భాగంగా సోమవారం రెండవ రోజు మంచిర్యాల సివి రామన్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో భాగంగా రహదారులపై ఉన్న చెత్తను, ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంపీటీసీ పార్వతి - మల్లేష్, మాజీ ఎంపిటిసి మంజుల రెడ్డి, పంచాయతీ సెక్రటరీ అన్నపూర్ణ, చీమల శ్రీకాంత్, ఏనుగు తిరుపతి రెడ్డి, ఏనుగు జలపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App