Kasipet Mandal News:-
విద్యార్థుల సైన్స్ పై అవగాహన పెంచడమే
చెకుముకి పోటీల ముఖ్య ఉద్దేశమని ఎంఈవో దామోదర్ రావు అన్నారు. గురువారం kasipet మండలంలోని మోడల్ స్కూల్ లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ ప్రతిభ పోటీల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో సైన్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన పెరిగితే మూఢనమ్మకాలు వంటి సామాజిక రుగ్మతలు దూరం అవుతాయన్నారు. చెకు ముకి సైన్స్ ప్రతిభ పోటీల నిర్వహణతో విద్యార్థుల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెరిగే అవకాశముందని జన విజ్ఞాన జిల్లా ఉపాధ్యక్షుడు రాథోడ్ దిలీప్ కుమార్ అన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ నాగమల్లయ్య, ఉపాధాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Source from:- Eenadu