Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ఎంపీడీవో
కార్యాలయంలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజా ప్రతినిధులు అధికారుల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశంలో ప్రస్తావించిన అంశాలు.
# అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని, అధికారులు పర్యవేక్షించి సరైన పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు.
# మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ ఏర్పాటు గురించి డాక్టర్ బాలాజీ గారిని వివరణ కోరగా సమస్యను ఐటీడీవో పీవో దృష్టికి తీసుకెళ్లామని , త్వరలోనే అంబులెన్స్ సేవలను పునరుద్ధిస్తామని తెలిపారు.
# ఆదివాసి రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు గ్రామ సభ తీర్మానం లేకుండా తవ్వకాలు చేపడుతున్నారని ఆదివాసి సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు.
# కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోయిన రైతులు కొందరికి నష్టపరిహారం అందలేదని, నష్టపరిహారం అందేలా చూడాలని ప్రస్తావించారు.
# మండలంలో దేవాపూర్ రేంజ్ మంచిర్యాల డివిజన్ పరిధిలో ఉండగా, కాసిపేట, ముత్యంపల్లి, ధర్మారావుపేట, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఉన్నాయని వీటిని ఒకే డివిజన్ పరిధిలోకి చేర్చాలని తీర్మానం చేశారు.
# కోనూరు గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని ప్రస్తావించగా, రెండు నెలల్లో గ్రామానికి నీరు అందేలా చూస్తామని ఏఈ వినయ్ తెలిపారు.
# మండలంలోని అటవీప్రాంతంలో పెద్దపులి వచ్చే అవకాశం ఉందని రైతులు పంట పొలాలకు జంతువులను వేటాడేందుకు కరెంటు తీగలు అమర్చకుండా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి సభ్యుడు పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీడీవో అలీమ్, తహసిల్దార్ భూమేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు కొండబత్తుల రామ్ చందర్, అక్కెపల్లి లక్ష్మి, మల్లేష్, చంద్రమౌళి, కో ఆప్షన్ నెంబర్ సిరాజ్ ఖాన్, సూపరింటెండెంట్ వినయ్ కుమార్, జేఏ లక్ష్మీనారాయణ, ఈవోపీఆర్డీ మేఘమాల, సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.