Kasipet Mandal News:-
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన రాజకీయ
నాయకుల ఆస్తులను జప్తు చేయాలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. అవినీతి వ్యతిరేక ప్రచార వారోత్సవాల సందర్భంగా మండలంలోని మోడల్ స్కూల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బత్తిని రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu