Kasipet Mandal News:-
Kasipet మండలంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలలో తెరాస నాయకులు మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ రోడ్డ లక్ష్మి హాజరై మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల ఆకలి కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతోనే మూడు నెలల పాటు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దనపల్లి తెరాస పార్టీ అధ్యక్షుడు చింతల భీమయ్య ఆధ్వర్యంలో 200 ప్లేట్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ ఆడె బాదు, తెరాస అధికార ప్రతినిధి పల్లె మల్లయ్య, దుర్గం రాంచందర్, ప్రిన్సిపల్ రవీందర్, రోడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu