Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్వేరోస్ మండల కమిటీ ఎన్నిక

Kasipet Mandal News:-
 కాసిపేట మండల కేంద్రంలో స్వేరో సర్కిల్ జిల్లా
అధ్యక్షుడు కర్రె రాజేశ్వర్ అధ్యక్షతన స్వేరో సర్కిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్వేరో సర్కిల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలన్నారు. ప్రతి ఒక్కరు సర్వోతాభివృద్ధి చెందుటకు విద్య అవసరం ఉందన్నారు. అనంతరం స్వేరో సర్కిల్ కాసిపేట మండల నూతన కమిటి ని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక ఉత్తర్వులను స్వేరో సర్కిల్ ఉమ్మడి, జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్, కర్రె రాజేశ్వర్ లు కమిటీ సభ్యులకు అందజేశారు. స్వేరో సర్కిల్ కాసిపేట మండల అధ్యక్షుడిగా దాడి పెంటయ్య,  ప్రధాన కార్యదర్శి గా కుర్సింగ మోహన్, అధికార ప్రతినిధిగా ఎల్పుల వెంకటేష్, ఉపాధ్యక్షుడు గా మారం మహేందర్,  కోశాధికారిగా గుండ అరవింద్,  సంయుక్త కార్యదర్శులు గా నగురారపు, హరి కృష్ణ, కోట ఆదర్శ్,  కార్యనిర్వాహక కార్యదర్శిగా దుర్గం నరేందర్, కమిటీ సభ్యులు గా గోనె శ్రీధర్, బోయిని ప్రవీణ్, మహేశ్వర్, కోట సంజయ్ లను ఎన్నుకున్నారు. అనంతరం కాసిపేట మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు స్వేరో సర్కిల్  కార్యక్రమాల యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను వివరిస్తూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా అధ్యక్షుడు కర్రె. రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బిజ్జురి రమేష్, సంయుక్త కార్యదర్శి అక్కేపల్లి శ్రీనివాస్,  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ గారు, సామాజిక సేవకుడు పల్లె మల్లయ్య గారు, స్వేరో సర్కిల్ కమిటీ సభ్యుడు తాళ్లపెళ్లి  పాపయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App