Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మళ్లీ కూలిన పైకప్పు

Kasipet Mandal News:-
Kasipet గనిలో గత వారం రోజుల వ్యవధిలో
రెండో సారి పైకప్పు కూలింది. మంగళవారం ఉదయం 1సీం, 10డిప్, 25 లెవెల్ లో పైకప్పు కూలింది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు అప్రమత్తమై పరుగులు పెట్టడం తో ప్రాణ నష్టం జరగలేదు. ఈ నెల 5వ తేదీన కూడా 1సీం, 7డిప్, 25 లెవెల్ లో పైకప్పు కూలింది. సంఘటన స్థలంలో అప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 1వ సీం లోనే ఐదురోజుల వ్యవధిలో రెండుసార్లు పైకప్పు కూలడంతో కార్మికులు 1వ సీం లో పని అంటే ఎప్పుడు ఎం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App