Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యార్థులకు దిశ అవగాహన కార్యక్రమం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కస్తూర్బా బాలిక
పాఠశాలలో వాయిస్ ఫర్ గర్ల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యం, భద్రత, హక్కులు, ఉన్నత చదువులు, వివాహం, ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ ఎబిలిటీ మొదలగు లైఫ్ స్కిల్స్ పై అవగాహన కల్పిస్తున్నామని క్యాంపు కోఆర్డినేటర్ సాహిత్య అన్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21న మొదలైందని, డిసెంబర్ 30 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఫర్ గర్ల్స్ క్యాంపు సభ్యులు, కస్తూర్బా ఎస్.వో సరిత పాల్గొన్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App