Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజావాణి కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో ఫోను చేసి పిలిపించారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజా సమస్యల పరిష్కరానికి తోడ్పడాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 12 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఈవోపీఆర్డీ మేఘమాల, సూపరిటెండెంట్ విజయ్ కుమార్, ఏపీవో స్వాతి, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App