Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

చలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

Kasipet Mandal News:-
ఆదివాసులు 9న ఢిల్లీలో తలపెట్టిన పోరుగర్జనకు
గిరిజనులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఢిల్లీలో మహాపోరుగర్జనను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో kasipet  మండలంలోని గిరిజన గుడాల నుండి వందల సంఖ్యలో ఆదివాసి ఉద్యమకారులు శనివారం తరలివెళ్లారు. కొండాపూర్ యాప వద్ద ఉన్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాలెగూడా నుండి వెళ్తున్న ఉద్యమ నాయకుడు సిడాం గణపతి తన తల్లి మోతు బాయి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని తరలి వెళ్ళాడు. కార్యక్రమంలో నాయకుడు ఆడే జంగు, పేంద్రం హనుమంతు, భీంరావు తదితరులు పాల్గొన్నారు.

Source from:- Andhra Jyothy 



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App