Kasipet Mandal News:-
Kasipet మండలంలోని మల్కేపల్లి ఆశ్రమ
పాఠశాలలో మల్కేపల్లి, రేగులగూడెం పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో పరిక్షలు-విజయం పేరుతో ప్రముఖ సైకాలజిస్టు, మోటివేటర్ దోమల నాగేంద్ర గారు పరీక్షలు అంటే భయాలను ఎలా పోడగొట్టాలి, పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా మార్కులు సాధించాలి అని విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రెండు ఆశ్రమ పాఠశాలల ప్రధమ ఉపాద్యాయులు, మీనారెడ్డి, రొడ్డు గోపాల్ లు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సోమగూడెం వారు మండలంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందని, అలాగే ఈ రోజు తమ విద్యార్థులకు కూడా భవిష్యత్తులో జరగబోయే పదవ తరగతి పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, మంచి నడవడిక గూర్చి చాలా అద్బుతమైన మోటివేషన్ అందించిన క్లబ్ కీ మా పాఠశాలల తరుపన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ గారు మాట్లాడుతూ మా క్లబ్ మండలంలో వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తూనే విద్యార్థులకు కూడా పరిక్షలను ఏలా ఎదుర్కొనాలో అనే విషయంపై కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వేముల కృష్ణ, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.