Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు కొండాపూర్ లో

Kasipet News/Kondapur:- (Nov 16)
కాసిపేట మండలం కొండాపూర్ (యాప) వద్ద
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారి ఆధ్వర్యంలో  శనివారం షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ప్రజలు షుగర్ నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు లక్ష్మీపూర్ మరియు వెంకటాపూర్ గ్రామాల్లో షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం ఉంటుందని  పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవ కార్యక్రమాలు మండలంలో విస్త్రుతంగా చేస్తామని, ప్రజలు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, డాక్టర్ రమేష్, ప్రజలు పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App