App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

దళారుల చేతిలో దగాపడుతున్న గిరిజన రైతులు

Kasipet Mandal News:-
గిరిజన ప్రాంతాల్లోని రైతుల అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకొని పత్తి కొనుగోలు దళారులు రెచ్చిపోతున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ఆటో ట్రాలీలలో దళారులు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ  పత్తిని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే రూ. 100  అధికంగా చెల్లిస్తామని తప్పు దోవ పట్టిస్తూ తూకంలో మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం కాసిపేట మండలం సోనాపూర్ బాదుగూడలో ఇలాంటి చోటు చేసుకుంది. బాధిత రైతు పేంద్రం బాబురావు తెలిపిన వివరాలిలా వున్నాయి. శనివారం ఓ ట్రాలీలో పత్తి కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు బాదుగూడకు వచ్చారు. ప్రభుత్వ మిల్లుల దగ్గర పత్తి అమ్మితే డబ్బులు చెల్లించేందుకు  15 రోజులు పడుతుందని, ధర తక్కువని మాయమాటలు చెప్పి పత్తిని కొనుగోలు చేసారు. తూకం ఎంతుందో చెప్పకుండా రూ. 12 వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారని బాధిత రైతు తెలిపారు. బాదురావ్ కొడుకు వచ్చిన తర్వాత లెక్క చెప్పితే అనుమానం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి బైక్ తో వెంబడించగా మల్కెపల్లి వద్ద పట్టుకుని నిలదీశారు. మళ్లీ పత్తిని తూకం వేయగా 3  క్వింటాళ్లు బరువు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు  చేస్తామని చెప్పడంతో దళారులు మిగతా రూ. 6 వేలు చెల్లించి అక్కడ నుంచి వెళ్లి పోయినట్లు తెలిపారు. తూకంలోనే స్ప్రింగును  ఉపయోగించి మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. 

Source from:- andhra jyothy 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App