Kasipet Mandal News/ Devapur:- తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది.కుటుంబ సభ్యుల
వివరాల ప్రకారం కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన కల్వల సతీష్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. భార్య అరుణ కూతురు తనీషతో కలిసి ఆస్పత్రిలో భర్తకు తోడుగా ఉంటున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో అరుణ, తనీషలను బయట ఉండాలని సిబ్బంది ఆదేశించారు. దీంతో అక్టోబర్ 29న బయటకు వచ్చిన తల్లీకూతుళ్లు కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో గురువారం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అరుణ కొద్దిగా మతిస్థిమితం లేకుండా ఉంటుందని, ఆచూకీ తెలిసినవారు 9440441008, 8341144624 నెంబర్లకు సమాచారం అందించాలని సతీష్ కోరారు.