Kasipet Mandal News/Devapur:- (Nov 10)
Kasipet మండలంలోని Devapur
గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రధాన రహదారిలో అనేక పశువులు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాహన యజమానులు, గ్రామస్తులు సర్పంచ్ తిరుమలకు వినతి పత్రాన్ని సమర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ దేవాపూర్ లోని రైల్వే గేట్ నుండి కంపెనీ వరకు అనేక పశువులు రోడ్లపై సంచరిస్తూ వాహనదారులకు అడ్డు పడుతున్నాయని, ఈ విషయంపై అందిన ఫిర్యాదు మేరకు శనివారం గ్రామ సిబ్బందితో రోడ్లపై పడుకున్న పశువులను గ్రామపంచాయతీ పశువులపాకలో తరలించడం జరిగిందని పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుండి ద్విచక్ర వాహనదారులు పశువులకు తగిలి గాయాలపాలయ్యారని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని పశువుల యజమానులు తమ పశువులను ఇంటివద్దనే కట్టి వేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా యజమానులు స్పందించి వెంటనే వాహనదారులపై పశువులు రాకుండా చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
Source from:- Andhra prabha
Download