Kasipet Mandal News/Mamidiguda:-
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి, సంక్షేమ
కార్యక్రమాల ఏర్పాటుకు కృషి చేస్తామని మందమర్రి జిఎం ఏ రమేష్ రావు స్పష్టం చేశారు. సోమవారం సింగరేణి ప్రభావిత గ్రామమైన కాసిపేట మండలంలోని మామిడి గూడా కు వెళ్లే దారిలో ఉన్న వాగుపై సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన తాత్కాలిక వంతెనను జిఎం రమేష్ రావు పరిశీలించారు. అనంతరం గ్రామంలోని సమస్యలను స్థానికులను, సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మామిడి గూడెం, గోండు గూడెం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు ఫ్యాన్, స్కూల్ బ్యాగులు, విద్యా సామాగ్రి, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి ఎం రమేష్ రావు మాట్లాడుతూ మామిడిగూడెంకు వెళ్లే దారిలో వాగు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా తమ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి మందమర్రి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో తాత్కాలికంగా వంతెన నిర్మించినట్లు తెలిపారు. దీంతో గ్రామానికి రాకపోకలు ప్రారంభం కావడంతో వారి ఇబ్బందులు తొలగడంతో గ్రామస్తులు ఆనందంగా ఉన్నారన్నారు. సింగరేణి సమీప గ్రామాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తాత్కాలికంగా వంతెన నిర్మాణం చేసినందుకు గ్రామస్తులు జిఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం వెంకటేశ్వర్లు, కేకే ఏసి పిఓ పద్మనాభ రెడ్డి, పిఎం మురళీధర్, ఐఈడి రాజన్న, ఎస్టేట్ అధికారిని నవనీత, ఐటి ప్రోగ్రామర్ రవి, సర్పంచ్ లావుడ్య సంపత్, గ్రామస్తులు ఉన్నారు.
Source from :- Namasthe telangana