Kasipet Mandal News:-
నేడు ప్రపంచ టాయిలెట్ల దినోత్సవం
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు
ఇబంద్దులు పడుతున్నారు. ఇప్పటికి వాటి అవసరాల కోసం విద్యార్థులు ఇంటికి వెళుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించింది. కానీ అధికారుల అలసత్వం, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తికాక పోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటికి, రెంటికి నేటికీ విద్యార్థులు ఇంటికి పరిగెడుతున్నారంటే పాఠశాలలోని మరుగుదొడ్ల పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా మరుగుదొడ్లు లేని పాఠశాలలే వున్నాయి. కాసిపేట మండలంలోని 20 కి పైగా పాఠశాలల్లో నేటికీ మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. 2016 -17 లో సర్వశిక్షా అభియాన్ నుంచి 32 పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల నిర్మాణం పేరిట రూ 40 లక్షలను విడుదల చేసారు. ఇందులో కొన్ని నిర్మాణాలకు నోచుకున్నప్పటికీ సరైన నీటి సౌకర్యం లేక అలంకార ప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. అలాగే 2017 -18 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలోని 8 పాఠశాలలకు రూ 16 లక్షల నిధులను మంజూరు చేసారు. ఈ పాఠశాలల్లో ఇప్పటి వరకు పునాది వరకు కూడా పనులు జరగలేదు. దింతో నేటికీ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ముత్యంపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాలలో బెష్మెంట్ లెవల్లో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనీ విద్యార్థులు , పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Source from:- Andhra Jyothy