Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాంట్రాక్టు కార్మికుల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న నాయకులు

Kasipet Mandal News:- 
Kasipet మండలంలోని Devapurలో ఓరియంట్
సిమెంట్ కంపెనీ కాంటాక్ట్ ఎన్నికలు జరిపేందుకు కొందరు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం. గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో అప్పటి కార్మిక నాయకుడు రాములు నాయక్ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులుగా ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఎన్నికలు జరపాలని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పర్మినెంట్ కార్మికుల ఎన్నికలు జరిగిన అనంతరం కాంట్రాక్టు కార్మికుల ఎన్నికలు జరుపుతారని ఎదురుచూసిన  కార్మికులకు నిరాశ ఎదురైంది. ఎట్టకేలకు తిరిగి ఎన్నికల ప్రచారం రావడం కార్మికుల్లో కొంత ఆనందం వెల్లివిరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంట్రాక్టు కార్మికుల ఎన్నికల కొరకు ఐదు మంది కార్మిక నాయకులు పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా త్వరగా ఎన్నికలు జరపాలని కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు.

Source from:- Andhra prabha

 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App