App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

మా పోడు భూములను కాపాడండి

Kasipet News/Laxmipur:-
అటవీ  శాఖ అధికారుల దాడుల నుంచి మా పోడు
వ్యవసాయ భూములను కాపాడాలని కోరుతూ బుధవారం తహసీల్దార్  భూమేశ్వర్ కు లక్ష్మీపూర్  బాధిత రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ  సందర్బంగా బాధిత రైతులు ఆత్రం బొజ్జిరావు, ఆత్రం గంగు , ఆత్రం సురేష్ లు  మాట్లాడుతూ వెంకటాపూర్ శివారులో తమకు 10 ఎకరాల భూమి ఉందని, గత 15 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు అటవీ అధికారులు  వచ్చి  ఇది అటవీ శాఖ భూమి మీరు సాగు చేయవద్దని నోటీసులు అందజేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తమ కుటుంబాలకు ఈ భూమి ఒక్కటే  దిక్కని, ప్రభుత్వం నిరుపేద గిరిజనులకు భూ పంపిణి చేస్తామని చెప్పారు కానీ సాగు చేసుకుంటున్నభూమిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకోకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App