Kasipet Mandal News:- (Nov 19)
మండల కేంద్రంలోని కాసిపేట గ్రామ
పంచాయతీలో సోమవారం స్మశానవాటిక భూమిపూజను తూర్పు వాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. స్మశాన వాటికకు సింగరేణి యాజమాన్యం రెండు ఎకరాల భూమి కేటాయించగా, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చదునుచేసి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్ ధరావత్ దేవి ఆధ్వర్యంలో భూమి పూజకు మండల ప్రత్యేక అధికారి సంజీవ్ రావు, తహసిల్దార్ ప్రసాద్ వర్మ, ఎంపీడీవో ఎంఏ అలీం, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపిపి విక్రమ్ రావు హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు తమ ఇండ్లకు, పాఠశాలకు దగ్గర్లో స్మశానవాటిక వద్దని తెలిపారు. స్మశాన వాటిక మంజూరు అయినందున కొంచెం లోపలికి నిర్వహిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన గ్రామస్తులు వద్దని అధికారులతో వాదనకు దిగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసి తిరిగి వెళ్లారు. అవసరం ఉన్న చోట నిర్మాణం చేపట్టాలని, మీరే వద్దని చెప్పినప్పుడు మాకేం పని అంటూ అధికారులు తిరిగి వెళ్లారు. కార్యక్రమంలో ఏంపీవో మేఘమాల, పంచాయతీ కార్యదర్శి ఇసాక్, ఉప సర్పంచ్ సుమన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sakshi