Kasipet Mandal News:- (Nov 14)
డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమిని రిలేషన్, తెలంగాణ
సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నామని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఫెర్రోస్ సర్కిల్ జిల్లా అధ్యక్షులు తీగల శ్రీనివాస్ తెలిపారు. యూనియన్ పబ్లిక్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం వసతి కల్పిస్తామని తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 17వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 24వ తేదీన ఉమ్మడి జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని, పూర్తి వివరాలకు 9849439020 నెంబర్ కి సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో స్వేరోస్ సర్కిల్ జాయింట్ సెక్రెటరీ బోర్లకుంట నవీన్, సంతపురి కిరణ్, సాయి ప్రసాద్, మల్లేష్, అరవింద్ తదితరులున్నారు.