Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అభివృద్ధి పనుల పై నిర్లక్ష్యం వద్దు

Kasipet Mandal News:- (Nov 5)
అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని
ఎంపీడీవో ఎంఏ అలీo ఆదేశించారు. ఎంపీడీవో కార్యక్రమంలో ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. గ్రామాల్లో రోజువారీగా పారిశుద్ధ్య పనులు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఏపీఓ స్వాతి, కార్యదర్శులు ఇసాక్, నాగరాజు, ప్రసాద్, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.

Source from:- Namasthe Telangana




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App