Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యార్థులపై పర్యవేక్షణ ఉండాలి

Kasipet Mandal News:- (Nov 19)
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలలో సోమవారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతల గురించి వివరించారు. విద్యార్థులు  తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఉపాధ్యాయులతో పాటు తల్లి తండ్రులు అప్రమత్తంగా ఉంటేనే చదువులో, సమాజంలో విద్యార్థులు రానిస్తారన్నారు. సీనియర్ ఉపాధ్యక్షులు జ్యోతి కుమార్,  వెంకట స్వామి, ఆంజనేయ ప్రసాద్, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు  పాల్గొన్నారు. 

గట్రావ్ పల్లి:- 
 మండలంలోని గట్రావ్ పల్లి గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సి.ఆర్.పి రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులు, హెచ్ఎంతో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు  ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. హెచ్ఎం సుగుణ, పాఠశాల చైర్మన్ యశ్వంతరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Source from:- Eenadu & Sakshi 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App