Kasipet News/Devapur:- ( Nov 18)
కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి
మద్దిమాడకు చెందిన రవిమహంతి అనే వ్యవసాయ కూలీ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, దేవాపూర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన రవిమహంతి కుటుంబం 15 ఏళ్ల క్రితం దేవాపూర్ కు ఉపాధి కోసం వలస వచ్చారు. ఏడాది కాలంగా రవి మహతి మద్యానికి బానిసై పని లేక జులాయిగా తిరుగుతున్నాడు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఉండగా క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
Source from:- Andhra Jyothy